గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

బాసర, ఆంధ్రప్రభ: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పవన్ చంద్ర సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ గోదావరిలో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు.

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా, నది పరివాహక ప్రాంతాల్లోని రైతులు, పశువుల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.