గూడెం మైసమ్మ కుంటలోంచి మట్టి తరలింపు – రైతుల ఆనందం

గూడెం మైసమ్మ కుంటలోంచి మట్టి తరలింపు – రైతుల ఆనందం

బెజ్జంకి, (ఆంధ్రప్రభ ): మండలంలోని గూడెం గ్రామంలో మైసమ్మ కుంటలో నుండి గ్రామ రైతులు నల్ల మట్టిని ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లి తమ పొలాల్లో వేసుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కుంటలో పూడికమట్టి పేరుకుపోవడంతో ఈ చర్యకు రైతులు ముందుకొచ్చారు.
రైతుల వివరాల ప్రకారం, కుంటలోని నల్ల మట్టిలో సేంద్రియ ఎరువులు అధికంగా ఉండటం వల్ల పొలాల్లో పోస్తే నేల సారవంతం పెరిగి పంట దిగుబడి మెరుగవుతుందని తెలిపారు. దీంతో రసాయన ఎరువుల వినియోగం తగ్గి ఖర్చులు కూడా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కుంటలోని పూడికమట్టిని తొలగించడం వల్ల చెరువు లోతు పెరిగి, వర్షాకాలంలో నీటి నిల్వ సామర్థ్యం అధికమవుతుందని రైతులు పేర్కొన్నారు. దీని ద్వారా సమీప బావులు, బోర్లలో నీటి మట్టం కూడా పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంతో వ్యవసాయానికి మేలు కలగడమే కాకుండా గ్రామంలో నీటి వనరుల సంరక్షణకు కూడా దోహదపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply