బాసర ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు
బాసర, ఆంధ్రప్రభ: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపును గురువారం ఆలయ ఈవో అంజనీ దేవి సమక్షంలో ప్రారంభించారు. ఆలయంలోని రూ.150 అక్షరాభ్యాస మండపంలో భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ప్రక్రియ చేపట్టారు.
హుండీలోని నగదు, ఇతర కానుకల పూర్తి లెక్కింపు అనంతరం వివరాలను సాయంత్రానికి వెల్లడిస్తామని ఆలయ ఈవో అంజనీ దేవి తెలిపారు.
