2:00 P.M. | 2 జూలై 2026 ముఖ్యాంశాలు

BRSWorkingPresident | హరీష్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం..

BRSWorkingPresident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రాష్ట్ర అప్పులు, గురుకులాల్లో అవినీతి అంశాలపై చర్చకు రావాలని తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే సవాల్ చేశారని, తాము ఆ సవాల్‌ను స్వీకరించిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేకపోవడంపై విమర్శలు గుప్పించారు. click here to read full news

Gold Price Update | Spot Gold | India Gold Rates | International Market | ఒక్కసారిగా పెరిగిన పసిడి రేట్లు.. ఎంత పెరిగిందంటే!

Gold Price Update | Spot Gold | India Gold Rates | International Market | ఆంధ్రప్రభ వెబ్‌, బిజినెస్ ప్రతినిధి: గత పది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.3,770, 22 క్యారెట్ల బంగారం రూ.3,450 పెరగడంతో పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో ఒకే రోజులో ఈ స్థాయిలో పెరుగుదల నమోదు కావడం ఇదే తొలిసారి. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు జోరందుకోవడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. click here to read full news

TG | బోడుప్పల్‌లో హైటెన్షన్..

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని బోడుప్పల్‌లో నిర్వహించనున్న భూ పోరాటానికి వెళ్లిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూ పోరాటాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. click here to read full news

congress vs brs| దద్దరిల్లిన తెలంగాణ రాజకీయాలు

ఆంధ్రప్రభ, హైదరాబాద్: గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణలు, రాష్ట్ర అప్పులపై ఇరు పార్టీల పరస్పర విమర్శలు సవాళ్లు–ప్రతిసవాళ్లకు దారితీశాయి. చర్చకు సిద్ధమంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా సవాళ్లు విసురుకోవడంతో గన్‌పార్క్, తెలంగాణ భవన్, ప్రెస్‌క్లబ్ ప్రాంతాలు రాజకీయ కేంద్రాలుగా మారాయి. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని పలువురు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. click here to read full news

july2ndindrakeeladri | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

july2ndindrakeeladri | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :  విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి బుధవారం (జూలై 1) కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు విడుదల చేసిన రోజువారీ గణాంకాల ప్రకారం, 31,064 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ దర్శనాల కోసం 4,588 దర్శన టికెట్లు జారీ చేశారు. ఆలయంలో ప్రసాదాల విక్రయాలు కూడా జోరుగా సాగాయి. రోజంతా 49,000 యూనిట్ల ప్రసాదం విక్రయించగా, భక్తుల నుంచి రూ.3,48,788 విరాళాల రూపంలో అందాయి. click here to read full news

Former CM | ప్రభుత్వంపై జగన్ విమర్శలు

Former CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విజయవాడలో పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… క్రాంతి కుమార్ మరణ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. click here to read full news

Narsingi | రూ.8 కోట్ల విల్లాపై ఏసీబీ తనిఖీలు

Narsingi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై డీఎస్పీ ఎస్. భీమ్‌రెడ్డి నివాసంలో గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తనిఖీలు హైదరాబాద్‌లోని భీమ్‌రెడ్డి నివాసంతో పాటు మొత్తం 20 ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. click here to read full news

vb-gram-ji-launch : ఊరూర.. ఉపాధి పండుగ Andhra Prabha News

ఆధ్రప్రభ, తిరుపతి బ్యూరో : దేశవ్యాప్తంగా గురువారం నుంచి అమలులోకి వచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీజీ-రామ్‌జీ)’ కార్యక్రమానికి తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామం వేదికగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ఈ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. click here to read full news

పై ముఖ్యాంశాల్లోని పూర్తి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి