Rs.2 thousand | పనిచేసే నాయకులకే మద్దతివ్వాలి..

Rs.2 thousand | పనిచేసే నాయకులకే మద్దతివ్వాలి..

Rs.2 thousand | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఎన్నికల సమయంలో ఓటు కోసం ఇచ్చే రూ.2వేల డబ్బులకు ఆశపడొద్దని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజలకు సూచించారు. ప్రజా సమస్యలపై నిజాయితీగా పనిచేసే నాయకులకే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

డబ్బులకు ఆశపడి ఓటు వేస్తే నాయకులు ప్రజలను పట్టించుకోరని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పనితీరును బట్టి ఓటు వేస్తే నాయకులే ప్రజల వద్దకు వచ్చి బాధ్యతగా పని చేస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటు విలువను గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు మరింత కష్టతరంగా మారే పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ప్రజలు చైతన్యంతో వ్యవహరించి.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.