INDvsAFG-ODI | డెబ్యూలోనే దడ పుట్టించారు..!

INDvsAFG-ODI | డెబ్యూలోనే దడ పుట్టించారు..!

  • హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ సంచలన ఆరంగేట్రం
  • తొలి మ్యాచ్‌లోనే రికార్డుల జాబితాలో చోటు

ఆంధ్రప్రభ : ధర్మశాల వేదికగా ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో (INDvsAFG-ODI) భారత యువ ఆటగాళ్లు హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ డెబ్యూతోనే అదరగొట్టారు. అంతర్జాతీయ క్రికెట్‌లో తమ తొలి మ్యాచ్ ఆడుతున్న ఈ ఇద్దరు బౌలర్లు కీలక వికెట్లు పడగొట్టి టీమిండియా విజయావకాశాలను మరింత బలోపేతం చేశారు.

ఆఫ్ఘాన్ ఓపెనర్ రహ్మానుల్లా గర్బాజ్ సెంచరీతో చెలరేగినా.. మిగతా బ్యాటర్లను కట్టడి చేయడంలో ఈ యువ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ హర్ష్ దూబే 5 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. పేసర్ గుర్నూర్ బ్రార్ 4.5 ఓవర్లలో 27 పరుగులకే 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

హర్ష్ దూబే అరుదైన జాబితాలో

దీంతో డెబ్యూలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత స్పిన్నర్ల జాబితాలో హర్ష్ దూబే చోటు దక్కించుకున్నాడు.

INDvsAFG-ODI

భారత్ తరఫున వన్డే డెబ్యూలో అత్యుత్తమ స్పిన్ బౌలింగ్ గణాంకాలు:

3/21 – నోయెల్ డేవిడ్ (వెస్టిండీస్‌పై, 1997)
3/32 – దిలీప్ దోషి (ఆస్ట్రేలియాపై, 1980)
3/36 – భగవత్ చంద్రశేఖర్ (న్యూజిలాండ్‌పై, 1976)
3/37 – పీయూష్ చావ్లా (బంగ్లాదేశ్‌పై, 2007)
3/43 – రాహుల్ శర్మ (వెస్టిండీస్‌పై, 2011)
3/47 – హర్ష్ దూబే (ఆఫ్ఘానిస్థాన్‌పై, 2026)

గుర్నూర్ బ్రార్ రికార్డు..

మరో డెబ్యుటెంట్ గుర్నూర్ బ్రార్ కూడా తన తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీసి భారత వన్డే చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాడు.

INDvsAFG-ODI

భారత్ తరఫున వన్డే డెబ్యూలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:

4/54 – ప్రసిద్ధ్ కృష్ణ (ఇంగ్లండ్‌పై, 2021)
3/21 – నోయెల్ డేవిడ్ (వెస్టిండీస్‌పై, 1997)
3/24 – వరుణ్ ఆరోన్ (ఇంగ్లండ్‌పై, 2011)
3/27 – గుర్నూర్ బ్రార్ (ఆఫ్ఘానిస్థాన్‌పై, 2026)
3/30 – సుబ్రతో బెనర్జీ (వెస్టిండీస్‌పై, 1991)

వీరితో పాటు అర్ష్‌దీప్ సింగ్ తన 100వ అంతర్జాతీయ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసుకోగా, నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఆఫ్ఘాన్ జట్టు 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది.

INDvsAFG-ODI

భవిష్యత్తుపై ఆశలు

ఒకే మ్యాచ్‌లో ఇద్దరు డెబ్యుటెంట్లు మూడేసి తీసి ఆకట్టుకోవడం భారత జట్టుకు శుభసూచకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తున్న ఈ సిరీస్‌లో హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ తమ ప్రతిభను నిరూపించుకోవడంతో టీమిండియాకు భవిష్యత్తులో మరిన్ని బౌలింగ్ ఆప్షన్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

INDvsAFG-ODI | గర్బాజ్ ఒంటరి పోరాటం.. భారత్‌కు 195 పరుగుల లక్ష్యం