Meeting | థియేటర్ల భవిష్యత్తుపై చర్చ..

Meeting | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలుగు సినిమా రంగంలో థియేటర్ల సమస్యలపై కీలక చర్చలు జరగనున్నాయి. సినిమా ఎగ్జిబిటర్స్ బృందం నటుడు చిరంజీవి నివాసానికి చేరుకుంది. పర్సంటేజ్ వ్యవహారం, సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలను చిరంజీవి దృష్టికి తీసుకెళ్లేందుకు వారు సిద్ధమయ్యారు.

ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు, సునీల్ నారంగ్, ఎగ్జిబిటర్ శ్రీధర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు జువ్వాడి శేఖర్, అనుపమ్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, బాల గోవింద్ రాజు తదితరులు పాల్గొంటున్నారు.

ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, రెవెన్యూ పర్సంటేజ్ విధానం, సినిమా ప్రదర్శన వ్యవస్థలో వస్తున్న మార్పులపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో అధికారిక చర్చలు ప్రారంభం కానున్నాయి.

Leave a Reply