కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి
కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి
- సీపీఐ మండల నాయకులు మంద భాస్కర్
కేసముద్రం, ఆంధ్రప్రభ: మోడీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 10న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ మండల నాయకులు మంద భాస్కర్ అన్నారు. ఆదివారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో ఓ ప్రకటన విడుదల చేస్తూ మాట్లాడుతూ కేంద్ర బిజెపి నరేంద్ర మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు.
గత 12 ఏళ్లలో నరేంద్ర మోడీ బిజెపి సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందన్నారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువకులను మోసం చేశారని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని అంబానీలకు అప్పజెప్పి కార్పొరేట్లకే రెడ్ కార్పెట్ వేస్తున్నాడన్నారు. విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడన్నారు నిత్యవసర సరుకులను రోజు,రోజుకు పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నాడు అన్నారు.
ఒకవైపు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచాడన్నారు ఎన్నికల్లో ఓట్లు వేసుకొని ఇప్పుడు ఇష్టారించిన రేట్లు పెంచుతున్నాడు అన్నారు. 12 ఏళ్ల మోడీ పరిపాలనలో దేశంలో 140 కోట్ల మంది ప్రజలు పూర్తిగా ఇబ్బందుల పాలవుతున్నారని మోడీ దేశానికి చేసిందేమీ లేదని వచ్చే ఎన్నికల్లో మోడీకి పతనం తప్పదు అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమవు తుందన్నారు.
మహిళలకు 2500 ఇంతవరకు ఇవ్వలేదని 4 వేల పెన్షన్ వృద్ధులకు వితంతువులకు పెంచలేదన్నారు. కొర్రీలు పెడుతూ ఇందిరమ్మ ఇల్లు సరిగా ఇవ్వడం లేదని అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
