నిత్య అన్నదానానికి రూ. లక్ష విరాళం
విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి చిత్తూరు జిల్లా చిత్తూరుకు చెందిన పి. సాయి కృష్ణ, అన్విక శ వారి కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో రూ.1,00,000 విరాళం అందజేశారు. ఆలయ అధికారులను కలిసి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అమ్మవారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయగా, వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రధానాలయ సూపర్డెంట్ సత్యనారాయణ అమ్మవారి ప్రసాదాలు, ప్రసాదాలను దాతలకు అందజేశారు.
