మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అరెస్ట్..
విజయవాడలో వైసీపీ నిరసన ఉద్రిక్తం..
వైసీపీ కార్యకర్తలు – పోలీసుల మధ్య తోపులాట..
పరస్పర ఆరోపణలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మరోవైపు, తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని, ఎలాంటి కారణం లేకుండా బలవంతంగా అరెస్టులు చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అనుచరులపై చర్యలు తీసుకోకుండా, తమ పార్టీ నేతలు, కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని పోలీసులు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. అయితే, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే చర్యలు తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
