ఇంద్రకీలాద్రి నిత్య అన్నదాన పథకానికి సహాయం

ఇంద్రకీలాద్రి నిత్య అన్నదాన పథకానికి సహాయం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ:

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిత్యం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి విశాఖపట్నానికి చెందిన దాతలు ఏ.బిజి అమిత్ రెడ్డి, భవ్య పేరున రూ.1,00,000/- విరాళంగా అందజేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్య అన్నదాన పథకం కోసం ఈ విరాళాన్ని అందించిన దాతలు, ఆలయ అధికారులను స్వయంగా కలిసి విరాళం మొత్తాన్ని సమర్పించారు. అధికారులు దాతలకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం ప్రధానాలే సూపర్నెంట్ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం రసీదులను అందజేశారు

Leave a Reply