ఆచార్య జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఘనంగా
క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 92వ జయంతిని పురస్కరించుకుని క్యాతన్‌పల్లి పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయశంకర్ సార్ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి, కమిషనర్ ఎన్. మురళీకృష్ణ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ సార్ కీలక పాత్ర పోషించారని, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
జయశంకర్ సార్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కూతురు ప్రభాకర్, భీమ మల్లేష్, గుర్రం శ్రీనివాస్, జంజిపల్లి శేషుకుమార్, వీనంక శ్రీనివాస్, గ్యాస్ నాని, బబ్బెర స్వర్ణలత, ముని రాజశేఖర్, మున్సిపల్ సిబ్బంది కిషన్, సాదిక్, కుమారస్వామి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
