మామిడి చెట్టుకు కుళ్ళిన మృతదేహం…

ఆళ్ళదుర్గ్, ఆంధ్రప్రభ : వ్యవసాయ పొలంలోని మామిడి చెట్టుకు గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని కుళ్ళిపోయిన స్థితిలో పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన మెదక్ జిల్లా అల్లదుర్గంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన రైతు నర్సింలు పొలంలోని ఓ మామిడి చెట్టు కొమ్మకు సుమారు 30 అడుగుల ఎత్తులో ఉరివేసినట్లు మృతదేహం లభ్యమైనది.
సుమారు 25-30 ఏళ్ల వయస్సు ఉండి కేవలం 3/4 షార్ట్ మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటన జరిగి 4 నుండి 5 రోజులు కావస్తుండటంతో మృతదేహం పూర్తిగా కూలిపోయింది. సమాచారం అందుకున్న ఏఎస్ఐ గాలయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఎవరనేది గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే తెలియజేయాలని పోలీసులు కోరారు.
