క్యాతనపల్లి కమిషనర్‌గా మురళీకృష్ణ..

  • క్యాతనపల్లి, చెన్నూరు కమిషనర్ల పరస్పర బదిలీ..
  • నూతన పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ

క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల కమిషనర్లను ప్రభుత్వం పరస్పరం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న మారుతి ప్రసాద్‌ను చెన్నూరుకు బదిలీ చేయగా, చెన్నూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న మురళీకృష్ణను క్యాతనపల్లికి బదిలీ చేశారు.

ఈ మేరకు మురళీకృష్ణ క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్‌గా నూతన బాధ్యతలు స్వీకరించారు. మారుతి ప్రసాద్ క్యాతనపల్లి మున్సిపాలిటీలో సుమారు ఆరు నెలల పాటు కమిషనర్‌గా విధులు నిర్వహించారు.

కాగా, క్యాతనపల్లి మున్సిపాలిటీకి బదిలీపై వచ్చిన మురళీకృష్ణ గతంలోనూ ఇదే మున్సిపాలిటీలో కమిషనర్‌గా పనిచేశారు. స్థానిక సమస్యలు, మున్సిపాలిటీ పరిధిలోని పరిస్థితులపై ఆయనకు మంచి అవగాహన ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. మురళీకృష్ణ రాకతో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి, మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని నూతన కమిషనర్ మురళీకృష్ణను స్థానిక ప్రజలు కోరుతున్నారు.