రేవూరి ప్రకాశ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి: సోదా రామకృష్ణ
పరకాల (ఆంధ్రప్రభ): పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుభవజ్ఞులకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పరకాల పట్టణ సమన్వయ కమిటీ సభ్యుడు సోదా రామకృష్ణ డిమాండ్ చేశారు.
తెలంగాణ శాసనసభ, శాసనమండలి 2026–27 సంవత్సరానికి సంబంధించిన కమిటీల ఛైర్మన్లు, సభ్యులను ప్రభుత్వం ప్రకటించగా, శాసనసభ ఎథిక్స్ కమిటీ ఛైర్మన్గా రేవూరి ప్రకాశ్ రెడ్డి నియమితులవడం అభినందనీయమని పేర్కొన్నారు. అయితే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవి దక్కకపోవడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలను నిరాశకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం రేవూరి ప్రకాశ్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించి ఆయన అనుభవాన్ని ప్రజాసేవకు వినియోగించుకోవాలని సోదా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
