Modi Indonesia Visit | ఇండోనేషియాలో మోడీకి అత్యున్నత గౌరవం..

Modi Indonesia Visit | ఇండోనేషియాలో మోడీకి అత్యున్నత గౌరవం..

Modi Indonesia Visit | రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇరుదేశాల మధ్య మరింత బలోపేతం

బ్రహ్మోస్, అస్త్ర క్షిపణి ఒప్పందాలతో రక్షణ సహకారానికి కొత్త దిశ

Modi Indonesia Visit | ఆగ్నేయాసియా దేశమైన ఇండోనేషియాతో రక్షణ సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తుతం జరుపుతున్న పర్యటన ఎంతో దోహదం చేస్తుంది. ఇండోనేషియాతో మన దేశానికి ఎంతో కాలంగా సత్సంబంధాలు ఉన్నాయి. 1965లో అధికారాన్ని చేజిక్కించుకున్న జనరల్ సుహార్తో 1998లో జరిగిన ప్రజావిప్లవంతో అధికారాన్ని కోల్పోయారు.

ఇండోనేషియాలో ఉన్న ఆరు అధికారిక మతాల్లో హిందూమతం ఒకటి. బాలి ద్వీపంలో 87 శాతం మంది హిందువులు ఉన్నారు. ఇక్కడికి వ్యాపారుల ద్వారానే కాకుండా పూజారులు, నావికులు, పండితుల ద్వారా హిందూమతం వచ్చింది. హిందూ దేవతల ఆరాధన జరుగుతుంది. బాలి ద్వీపంలో 20 వేల ఆలయాలు ఉన్నాయి. భారత్, నేపాల్, బంగ్లాదేశ్‌ల తర్వాత ఇండోనేషియాలోనే హిందువులు ఎక్కువ మంది ఉన్నారు.

దక్షిణ భారత సముద్ర వ్యాపారులు తమతో హిందూమతాన్ని ఇండోనేషియాకు తీసుకువచ్చారనే వాదం ఉంది. ఒమన్, యెమెన్‌ల నుంచి ఇస్లాం మతాన్ని తీసుకువచ్చారు. ఆ తర్వాత అది ఇస్లాం ప్రధాన మత దేశంగా తయారైంది. అయితే, ఇండోనేషియాలో హిందువులకు సమాన గౌరవం, ప్రతిపత్తి లభిస్తున్నాయి.

ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్రధాని నరేంద్రమోడీకి ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో నలుగురు కేబినెట్ మంత్రులతో కలిసి వెళ్లి స్వాగతం పలకడాన్ని బట్టి మన దేశానికి ఇండోనేషియా ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అర్థమవుతుంది.

సముద్ర పరంగా భారత్‌తో ఇండోనేషియా రక్షణ సంబంధాలు ఏర్పరుచుకుంది. ఆధునిక కాలంలో సముద్రపు దొంగల వల్ల తమ దేశానికి తగిన రక్షణ కోసం భారత్ వంటి పెద్ద దేశంతో సంబంధాలు అత్యవసరం అని ఇండోనేషియా భావిస్తోంది.

బాలి ద్వీపం అతి పెద్ద పర్యాటక కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆధునిక కాలంలో బాలి ద్వీపంలో చలనచిత్ర నిర్మాణానికి సంబంధించిన అవుట్‌డోర్ షూటింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి.

ఇండోనేషియా మన దేశం నుంచి రక్షణ సంబంధమైన సహాయం పొందేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. బ్రహ్మోస్ డిఫెన్స్ సిస్టమ్ చాలా ముఖ్యమైనది. అస్త్ర క్షిపణి ఒప్పందం కూడా ముఖ్యమైనదే. ఇండోనేషియా ఫైటర్ జెట్లు మన ప్రధాని మోడీకి ఎస్కార్ట్గా వెళ్లాయి. ఇది చాలా అపూర్వమైన మర్యాదగా పరిగణిస్తున్నారు.

బ్రహ్మోస్ ఒప్పందంతో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. అస్త్ర క్షిపణులు ఆపరేషన్ సిందూర్‌లో పేరొందాయి. రక్షణ రంగంలో భారత్ సాధించిన అభివృద్ధిని ఇండోనేషియా గుర్తించడం వల్లనే ఈ రంగంలో భారత్ నుంచి సహాయం పొందేందుకు ముందుకు వచ్చింది.

మోడీ ఇండోనేషియా పార్లమెంటులో ప్రసంగించారు. ఆయనకు ఇండోనేషియా అత్యున్నత పురస్కారం లభించింది. ఇండోనేషియాలో ఈవీఎంలకు భారత్ పూర్తి సహాయ, సహకారాలను అందించనున్నది.

ఈవీఎంలపై మన దేశంలో ఫిర్యాదులు వస్తున్న సమయంలో ఇండోనేషియా మన ఈవీఎం పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం గమనార్హం. జకార్తాలో మోడీకి లభించిన గౌరవం అపూర్వమైనది. భారత్‌కు ఇండోనేషియా ఎంత ప్రాధాన్యం ఇస్తోందో తెలియజేయడానికి ఇది నిదర్శనం.

ఇండోనేషియాలో అత్యధికులు ముస్లింలు ఉన్నప్పటికీ భారత్‌కు అత్యున్నత గౌరవం ఇవ్వడం మన దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల వారికి ఉన్న గౌరవానికి నిదర్శనం.