కాంగ్రెస్ అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు వైఎస్సార్

ఆమనగల్లు (ఆంధ్రప్రభ): కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి అలుపెరగని సైనికుడిలా కృషి చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చిరస్మరణీయుడని ఆమనగల్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు శివలింగం అన్నారు. బుధవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఆయన 77వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కేక్ కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు.

అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, 108, 104 అంబులెన్స్ సేవలు, దళితులకు భూ పంపిణీ, రూపాయికే కిలో బియ్యం, పెన్షన్ల పెంపు వంటి సంక్షేమ పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడిగా వైఎస్సార్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, యాట నరసింహ, పత్య నాయక్, వరకల శ్రీను, గుర్రం కేశవులు, మంగలి రాములు, కొండాలరెడ్డి, ఖాదర్, విజయ్, కృష్ణా నాయక్, అలీమ్, ఫరీద్, ఖాదర్ ఖాద్రి, పులికంటి మైసయ్య, వసుపుల శ్రీశైలం, ఎంగలి ప్రసాద్, కాలే మల్లయ్య, కండే సాయి, చుక్క వెంకటయ్య గౌడ్, శ్రీకాంత్, గౌస్, దేవరశెట్టి మహేష్, కృష్ణ, నాసార్, సురేశ్, శ్రీను నాయక్, రఫీ తదితరులు పాల్గొన్నారు.