శానిటరీ వర్కర్స్ ను గౌరవించటం మనందరి బాధ్యత

శానిటరీ వర్కర్స్ ను గౌరవించటం మనందరి బాధ్యత

  • విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్

విజయవాడ, ఆంధ్రప్రభ ; మన పరిసరాలను నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్ కార్మికులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాథ పేర్కొన్నారు. యునైటెడ్ తెలుగు కిచెన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోగంటి రామారావు తనయుడు కోగంటి కౌశిక్ బాబు మున్సిపల్ కార్మికులను ప్రత్యేకంగా సన్మానించి గౌరవించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎంపీ ఇచ్చింది మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తల ను ప్రోత్సహించడానికి తాను ఎప్పుడూ ముందు ఉంటానని,యు టి కె హోటల్ కష్టకాలంలో ఏర్పడిందని ఇప్పుడు పరిస్థితులు కూడా రాష్ట్రంలో సర్దుకున్నాయన్నారు. పారిశుద్ధ్య కార్మికుల వల్లనే విజయవాడ నగరం రోజురోజుకు సుందరీ కారణంగా మారుతుందని కరోనా లాంటి కష్ట సమయాల్లో ను విజయవాడలో వరదలు లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ శానిటేషన్ సిబ్బంది చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేని పేర్కొన్నారు.

మున్సిపల్ సిబ్బందే విజయవాడ ఫ్రంట్ లైన్ వారియర్స్ అని అభివృద్ధి చెందుతున్న విజయవాడలో శానిటేషన్ సిబ్బంది పాత్ర మరువలేనిదని అన్నారు.విజయవాడ విశాఖపట్నం లాంటి చోట్ల హోటల్స్ కొరత ఎక్కువగా ఉందని కొత్త గా వ్యాపారం చేయాలనుకునే వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కొత్త వ్యాపారిస్తులను భుజం తట్టడమే తమ లక్ష్యమని అన్నారు.

దేశ విదేశాల్లో 50 బ్రాంచీలు పైనే ఉన్న యునైటెడ్ తెలుగు కిచెన్ అనేక దేశాల్లో తెలుగువారి రుచులు పరిచయం చేస్తుందన్నారు. కర్మభూమితోపాటు జన్మభూమి కి సైతం మంచి చేయడం మనందరి కర్తవ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు నాగ వంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీపతి మాజీ కార్పొరేటర్లు నరసింహ చౌదరి ముమ్మినేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి సీనియర్ నాయకులు వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply