మరమ్మతులు చేపడతాం
తాడ్వాయి, ఆంధ్రప్రభ : వృధాగా పోతున్న మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీరు పట్టించుకోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అనే ఆంధ్రప్రభ కథానానికి స్పందించారు. తాడ్వాయి మండల కేంద్రంలో ఆర్డబ్ల్యూఎస్ తాగు నీరు సప్లై అవుతున్న పైపులైన్ మరమ్మత్తు పనులను త్వరలోనే చేపడుతామని ఆర్ డబ్ల్యు ఎస్ డీఈ సునీత(RWS DE Sunitha) తెలిపారు.
ఈ రోజు ఆమె మండల కేంద్రంలో లీకేజీలను పరిశీలించి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ శాఖ ఆధ్వర్యంలో పైప్ లైన్ మరమ్మతు(Pipe Line Repair) పనులు చేపడతామన్నారు. రోడ్డుపై లీకేజీ అవుతున్న నీటిని పరిశీలించి ఎన్ హెచ్163 అధికారులతో మాట్లాడి వారి సమన్వయంతో మరమ్మతులు చేపడతామని వివరించారు. ఆమె వెంట తాడ్వాయి గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులున్నారు.

