కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీసుల మెరుపు దాడులు
కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీసుల మెరుపు దాడులు
వంద మందికి పైగా జూదగాళ్లను అదుపులోకి తీసుకున్న జిల్లా పోలీసులు
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : జిల్లాలోని వందమందికి పైగా క్రికెట్ బెట్టింగులు, పేకాట శిబిరాలు, కోడిపందాల నిర్వాహకులను కృష్ణాజిల్లా పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ సబ్ డివిజన్… గన్నవరం సర్కిల్ పరిధిలో…. జిల్లా పోలీస్ యంత్రాంగం దాడులు చేపట్టింది. అదుపులోకి తీసుకున్న వారిలో పలువురుపై బైండోవర్ కేసులు పెట్టనున్నట్లు సమాచారం. కొద్దిసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించనున్న జిల్లా పోలీసులు.
గుడివాడలో ఐదుగురి బైండోవర్…
స్థానిక టిడ్కో కాలనీ ప్రాంతంలో గతంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఎలాంటి పందేలు జరగకుండా ఉండేందుకు గుడివాడ రూరల్ ఎస్ఐ ఎన్. చంటిబాబు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కలిపిండి శివ(మషాల శివ), నూకారపు భాను ప్రసాద్, మండాది కనక మహేష్, బోయిన కృష్ణ అజయ్, మామిడి కిరణ్ ను అదుపులోకి తీసు కుని తహసీల్దారు కోర్టులో బైండోవర్ చేశారు. వీరు భవిష్యత్తులో ఎలాంటి క్రికెట్ బెట్టింగ్లు, జూదాలకు పాల్పడకుండా 6 నెలల పాటు సత్ప్రవర్తన కలిగి ఉంటామని వారి నుంచి రూ. లక్ష వ్యక్తిగత పూచీక త్తును తీసుకుని విడుదల చేశారు.
