తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రెండు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున 17 లక్షల మందికి రూ.2,223.46 కోట్ల నిధులు విడుదలయ్యాయి. దీంతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 37 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి.