700 in IPL | అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్
700 in IPL | అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్
పూర్తి స్థాయిలో సిద్ధమైన టీమిండియా
హెడ్ కోచ్ గంభీర్ స్పష్టం
700 in IPL | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : న్యూ చండీగఢ్ వేదికగా రేపటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్న ఇండియా, అఫ్గనిస్థాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం టీమిండియా పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ జట్టు కూర్పుపై కీలక ప్రకటన చేశారు. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ నంబర్ 3 స్థానంలో బరిలోకి దిగుతాడని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు అతనికి తగినన్ని అవకాశాలు రాలేదని, కానీ అతని ప్రస్తుత ఫామ్ అద్భుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
గంభీర్ వ్యాఖ్యల ప్రకారం:
సాయి సుదర్శన్ ఇంగ్లండ్ పర్యటనలో కూడా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో 700కి పైగా పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. కేవలం కొన్ని మ్యాచ్‌ల ఆధారంగా ఆటగాడిని అంచనా వేయడం సరైంది కాదు. భవిష్యత్ దృష్టితో అతనికి వరుస అవకాశాలు ఇవ్వనున్నాం. ఈ నిర్ణయంతో దేవదత్ పడిక్కల్ తుది జట్టులో బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ సాధనే లక్ష్యంగా జట్టు నిర్మాణం జరుగుతోందని ఆయన వెల్లడించారు.
స్పిన్ దళంపై ప్రత్యేక దృష్టి
ఆగస్టులో శ్రీలంక పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఈ పర్యటనలో నలుగురు స్పిన్నర్లను సిద్ధం చేస్తున్నట్లు గంభీర్ తెలిపారు. అలాగే అఫ్గానిస్థాన్‌తో టెస్ట్‌లో కూడా నాలుగు స్పిన్నర్ల వ్యూహం అమలు చేసే అవకాశం ఉంది. పిచ్ పరిస్థితులను బట్టి వ్యూహాన్ని కొనసాగించనున్నామని తెలిపారు.
అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌కు ఎంపికైన భారత జట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్‌దూబే, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్, మానవ్ సుతార్.
