లక్నో వేదికగా ఆర్సీబీతో జరుగుఉన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు, బౌండరీల తుపానుతో మైదానాన్ని ముంచెత్తారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోరు సాధించింది.
టాప్ ఆర్డర్ నుంచే సన్‌రైజర్స్ బ్యాటర్లు ధూంధాంగా ఆడుతూ… పరుగుల వరద పారించారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ (17 బంతుల్లో 34), ట్రావిస్ హెడ్ (10 బంతుల్లో 17) కలిసి తొలి వికెట్ కు కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు జోడించి శుభారంభం చేశారు.
తర్వాత వన్‌డౌన్ లో క్రీజ్‌లోకి వచ్చిన ఇషాన్ కిషన్ అసలైన ఆటను ఆరంభించాడు. షాన్‌ధార్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న ఇషాన్.. ఆట ముగిసే వరకు క్రీజ్‌లో నిలిచాడు. ఇషాన్ కిషన్ కేవలం 48 బంతుల్లో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 24), అనంతరం అనికేత్ వర్మ (9 బంతుల్లో 26) దంచేశారు. వీరిద్దరూ ఇషాన్‌తో కలిసి వరుసగా 3వ వికెట్‌కు 48 పరుగులు (27 బంతుల్లో), 4వ వికెట్‌కు 43 పరుగులు (17 బంతుల్లో) జోడించి స్కోరును ఆకాశానికి తీసుకెళ్లారు.
అయితే మధ్య ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు కాస్తగా విజృంభించారు. రొమారియో షెపర్డ్ రెండు కీలక వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎన్గిడి, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా తలాసరి ఒక్క వికెట్ చొప్పున తీసుకుని సన్‌రైజర్స్ దూకుడు కాస్త అడ్డుకున్నారు.
ఇప్పుడీ మ్యాచ్‌లో 232 పరుగుల భారీ లక్ష్యంతో ఆర్సీబీ మైదానంలోకి దిగనుంది.