Corona | కోరలు చాస్తున్న కరోనా… కూకట్‌పల్లిలో డాక్టర్‌కు పాజిటివ్

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా తొలి కేసు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, కడప జిల్లాల్లో రెండు పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పుడు తెలంగాణలోనూ మొదటి కేసు బయటపడటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.

అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ:

  • కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ కీలక మార్గదర్శకాలు విడుదల చేశారు.
  • ముఖ్యంగా, ప్రజలు సామూహిక కార్యక్రమాలు, ప్రార్థన సభలు, వేడుకలు, పార్టీలు తదితరాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని సూచించారు.
  • ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
  • జ్వరం, చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, శరీర నొప్పులు, ముక్కు కారడం, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి.

దేశవ్యాప్తంగా పరిస్థితి..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 247 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు వెలుగుచూశాయి.

వైద్య అధికారులు ప్రజలకు భరోసా ఇస్తూ.. – భయపడాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply