BCCI Refund | మా డ‌బ్బులు ఇచ్చేయండి..

BCCI Refund | మా డ‌బ్బులు ఇచ్చేయండి..

  • మంచు కార‌ణంగా నాలుగో టీ20 మ్యాచ్ ర‌ద్దు
  • అభిమానుల ఆగ్ర‌హం
  • టికెట్ డ‌బ్బులు వాప‌స్ చేయాల‌ని డిమాండ్‌

BCCI Refund | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియం(Ekana Stadium) వేదికగా జరగాల్సిన నాలుగవ టీ20 మ్యాచ్ రద్దయింది. అధిక పొగమంచు కారణంగా మైదానాన్ని పలుమార్లు పరిశీలించిన అనంతరం, మ్యాచ్ నిర్వహణకు వాతావ‌ర‌ణం అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు(Umpires) ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు నిరాశగా మైదానం నుంచి వెనుదిరిగారు.

మ్యాచ్ ర‌ద్దుపై పలువురు ప్రేక్షకులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చాలా కష్టపడి మ్యాచ్ టిక్కెట్లు(Match Tickets) కొనుగోలు చేశామని, ఆ నగదు వెనక్కి తిరిగి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. మరికొందరు డబ్బులు తిరిగి చెల్లించడం దీనికి పరిష్కారం కాదని, మేం టీమ్ ఇండియా మ్యాచ్ చూడాలనుకున్నామని తెలిపారు.

లఖ్‌నవూలో కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు మ్యాచ్‌ను రాత్రి పూట కాకుండా, మధ్యాహ్నం నిర్వహిస్తే బాగుండేదంటున్నారు. బీసీసీఐ రీఫండ్(BCCI Refund) పాలసీ ప్రకారం.. ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దైతే, దానికి సంబంధించిన టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చే అవకాశముంది.

Leave a Reply