Raviteja, Kaarthi | ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది…?
Raviteja, Kaarthi | ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది…?
Raviteja, Kaarthi | రవితేజ కోసం రాసిన కథ.. కార్తితో ఫిక్స్?
‘మ్యాడ్’ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో భారీ సినిమా?
రవితేజ ఎందుకు నో చెప్పారు..?
కార్తి ఎందుకు ఎస్ చెప్పాడు..?
100 కోట్ల బడ్జెట్‌పై ఇండస్ట్రీలో చర్చ
Raviteja, Kaarthi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒక హీరో కోసం కథ రాస్తే.. మరో హీరోతో సెట్ అవ్వడం అనేది ఇండస్ట్రీలో అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. మాస్ మహారాజా రవితేజ కోసం కథ రాస్తే.. కోలీవుడ్ స్టార్ కార్తితో సెట్ అయ్యిందని తెలిసింది. ఈ మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ కి రవితేజ ఎందుకు నో చెప్పారు…? అసలు ఈ ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది..?
Raviteja, Kaarthi | డిస్కషన్ స్టేజ్ లోనే..

మ్యాడ్ సినిమాతో ఆకట్టుకుని సక్సెస్ సాధించాడు కళ్యాణ్ శంకర్. ఆతర్వాత మ్యాడ్ 2తో మరో సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మ్యాడ్ జూనియర్స్ అనే మరో ఎంటర్ టైనర్ రెడీ చేస్తున్నాడు. అయితే.. మ్యాడ్ 2 తర్వాత మాస్ మహారాజా రవితేజతో సినిమా చేయాలి. దాదాపుగా రవితేజ, కళ్యాణ్ శంకర్ సినిమా ఫిక్స్ అయ్యిందని.. ఈ సినిమా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. డిస్కషన్ స్టేజ్ లోనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
Raviteja, Kaarthi | అందుకే ఆగిపోయిందా…?

రవితేజకు చెప్పిన కథనే కళ్యాణ్ శంకర్ కార్తికి చెప్పాడట. ఆయనకు కథ నచ్చిందట. ఓకే చెప్పారని.. ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయ్యిందని సమాచారం. రవితేజ ఎందుకు నో చెప్పారు..? కార్తి ఎందుకు ఎస్ చెప్పారు అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. రవితేజ కోసం కళ్యాణ్ శంకర్.. ఓ సూపర్ మేన్ స్టోరీ చెప్పాడట. ఈ కథ రవితేజకు నచ్చిందట. కాకపోతే.. బడ్జెట్ 100 కోట్లు అవుతుందట. రవితేజ వరుస ప్లాపుల్లో ఉన్నాడు. అతనితో అంత బడ్జెట్ వర్కవుట్ కాదనే ఉద్దేశ్యంతోనే ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదట. కార్తికి అయితే.. తెలుగు, తమిళ్ లో మార్కెట్ ఉంది కాబట్టి వర్కవుట్ అవుతుందనే ఉద్దేశ్యంతో నాగవంశీ ఎస్ చెప్పి ఉంటారని టాక్ వినిపిస్తోంది. అయితే..100 కోట్ల బడ్జెట్ అంటే.. కార్తితో అయినా రిస్కే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. ఈ ప్రాజెక్ట్ ఏం జరగనుందో చూడాలి.

