Notices | కేసీఆర్ కు నోటీసులు..
Notices | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ లోని నందినగర్‌లో గల ఆయన నివాసానికి వెళ్లి అధికారులు నోటీసులు అందజేశారు. ఈ పరిణామంపై కేసీఆర్ కుమార్తె కవిత స్పందించారు. ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.
సిట్ విచారణకు కేసీఆర్ హాజరై వివరణ ఇస్తారన్నారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగితే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. సిట్ రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీస్తోందన్నారు. ఈకేసులో విచారణ ఇంకా సీరియస్ గా జరగాల్సిందన్నారు.
