​Railway Station | అపరిచిత మృతదేహం లభ్యం….

​Railway Station | అపరిచిత మృతదేహం లభ్యం….

​Railway Station | మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్, మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం ఒక అపరిచిత వృద్ధుని మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. ​స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సుమారు 60 నుండి 70 ఏళ్ల వయస్సు గల వృద్ధునిగా గుర్తించారు. ఆయన శరీరంపై కొన్ని గాయాల గుర్తులు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మృతుడు సన్నని దేహధారుఢ్యం కలిగి ఉండి, నెరిసిన నల్లని జుట్టు, గడ్డం, మీసాలతో ఉన్నారు. మృతదేహంపై లేత రంగు షర్టు, ముదురు రంగు చెక్స్ లుంగీ ఉన్నాయి. ​మృతుని వివరాలు తెలిసిన వారు లేదా ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే మేడ్చల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

CLICK HERE TO READ MORE : ఒక కూతురు చివరి సందేశం..

CLICK HERE TO READ MORE :

Leave a Reply