Komatireddy | పదేళ్లు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి..

Komatireddy | పదేళ్లు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి..
Komatireddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెల్లరేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం ఇస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ… బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. రూ.20 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి రూ.11వేల కోట్లు చెల్లించామన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నందుకు ధన్యావాదాలు చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన మంచి కార్యక్రమాలు ఒక్కటైనా చెప్పాలన్నారు. అప్పుల బారిన పడిన రాష్ట్రాన్ని క్రమంగా గాడిలో పెట్టేందుకు యత్నిస్తున్నామన్నారు. రెండున్నరేళ్లలో రూ.3.25 లక్షల కోట్ల బకాయిలు చెల్లించామన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు చెప్పాలని.. ప్రజలను మోసగించినందుకు బీఆర్ఎస్ పార్టీ వారు క్షమాపణలు చెప్పాలన్నారు.
