భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

గుడివాడ – ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుడివాడ పట్టణ బిజెపి నాయకులు, కార్యకర్తలు జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. గుడివాడ పట్టణ స్థానిక భారతీయ జనతా పార్టీ ఆఫీసులో సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలిజేశారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ… ప్రపంచంలో అతిపెద్ద శక్తివంతమైన రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని తెలియజేశారు.

గ్రామ స్థాయి కార్యకర్త నుంచి దేశ ప్రధానిగా ఎదగగల అవకాశాన్ని ఇచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది మన భారతీయ జనతా పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా విచ్చేసిన పార్లమెంట్ కన్వీనర్ సురే గాంధీ, జిల్లా నాయకులు అంగడాల సతీష్, ఇంచార్జ్ ఎర్రపోతు అర్జున్, గుడివాడ పట్టణ మహిళా అధ్యక్షురాలు బోనం గోపిక, చలపతి, రాజు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply