Kharal Das Waterfall | పర్యాటకులను కట్టిపడేస్తున్న ఖరల్ దాస్ జలపాతం

Kharal Das Waterfall |ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: ప్రకృతి ప్రేమికులకు. పర్యాటకులకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. నుపడా జిల్లా పరిధిలో ఉన్న ‘ఖరల్ దాస్’ జలపాతం ప్రస్తుతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది.

ఐదు వందల అడుగుల అద్భుతం..
దాదాపు ఐదు వందల అడుగుల భారీ ఎత్తు నుండి కిందకు జాలువారుతున్న ఈ జలపాతం సుందర దృశ్యం పర్యటలను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు, ప్రకృతి ఒడిలో కాసేపు గడిపేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. దీంతో ఖరల్ దాస్ జలపాతం పూర్తి జలకళను సంతరించుకుని, ఉరకలేస్తూ కిందకు దూకుతోంది. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం వరద ఉధృతి పెరగడంతో ఈ జలపాతం మరింత అందంగా మారిందని, దీంతో చుట్టుపక్కల ప్రాంతాల నుండి సందర్శకుల తాకిడి గణనీయంగా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ జలపాతానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.