ఒక కూతురు చివరి సందేశం..

ఒక కూతురు చివరి సందేశం..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నాన్న జాగ్రత్త…” — చేతి పై ఇలా రాసుకున్న ఒక కూతురు చివరి సందేశం… కుటుంబానికే కాదు, చదివిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో పామూరు మండలం పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. టీచర్‌గా పని చేస్తున్న మాధవి (24) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం… మాధవికి నాగూర్ బాషా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వ్యక్తిగత స్థాయికి చేరినట్లు సమాచారం. అయితే.. అతనికి ఇప్పటికే వివాహం జరిగిందని తెలిసిన తర్వాత మాధవి దూరంగా ఉండేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో నాగూర్ బాషా వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మాధవి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఆత్మహత్యకు ముందు మాధవి తన చేతిపై “నాన్న జాగ్రత్త” అని రాసుకోవడం ఘటనను మరింత హృదయ విదారకంగా మార్చింది. కూతురు చివరి మాటలుగా మిగిలిన ఈ సందేశం కుటుంబ సభ్యులను కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. నాగూర్ బాషాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.

ఈ ఘటన మరోసారి యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, సోషల్ మీడియా దుర్వినియోగం ఎంత ప్రమాదకరమో గుర్తు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు ముందుగానే స్పందించి సహాయం అందించడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply