ఓపెన్ జిమ్‌లో బురద.. వాకర్లకు ఇబ్బందులు

వలిగొండ (ఆంధ్రప్రభ): యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న ఓపెన్ జిమ్‌లో వర్షపు నీరు నిలిచి బురదగా మారడంతో వాకర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల్లో నీరు నిలవడంతో వ్యాయామం చేసేందుకు వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారని వలిగొండ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రచ్చ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గొలుసుల నర్సింహ ఆధ్వర్యంలో సభ్యులు బుధవారం ఓపెన్ జిమ్‌ను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి ఓపెన్ జిమ్‌లోని గుంతలను మట్టితో పూడ్చి, స్థలాన్ని చదును చేసి చిప్స్ వేయించేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పడమటి దామోదర్ రెడ్డి, పోలేపాక బిక్షపతి, మామిళ్ల రత్నయ్య, పబ్బు స్వామి, శ్రీకాంత్, జహంగీర్, నరసింహ, శ్రీనివాస్, శంకర్, కిషన్, శివ, సైమన్ తదితరులు పాల్గొన్నారు.