కడెంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..
కడెం, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కడం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సామాజిక న్యాయం, రైతులు, యువత మరియు పేదల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, దేశ భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తున్న రాహుల్ గాంధీ గారికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ భూషణ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, కడం పెద్దూర్ సర్పంచ్ దీకొండ విజయ్, ఆర్టీఏ సభ్యుడు మల్లేష్, ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా అధ్యక్షుడు కట్ట శ్యాంసుందర్ ఉప సర్పంచ్‌ల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి, కార్యదర్శి మధు, మండల నాయకులు తారీ శంకర్, నరేష్, సలీమ్, కోలా గంగన్న, రాజేశ్వర్, రాజేష్, శేఖర్, బబ్లు, లింగన్న, ధర్మయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీఎల్‌ఏ సభ్యులు పాల్గొన్నారు.
