ఉర్కొండలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
ఉర్కొండ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలను ఉర్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అయూబ్ పాషా ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కృషి చేస్తున్న నాయకుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీకి ఆయురారోగ్యాలు కలగాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయ చైర్మన్ మనోహర్ రెడ్డి, సర్పంచులు రమేష్ నాయక్, వినీత ధర్మేందర్ రెడ్డి, సోని నరసింహ, యువజన నాయకులు లోహిత్ రెడ్డి, కృష్ణారెడ్డి, జీవన్ చారి, బంగారి, ఆరిఫ్, రఫీక్, వెంకటయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
