నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి చెందిన సంకోజ్ శ్రీనివాస్ (కమ్మరి శ్రీనివాస్) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. ఇంటి పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబానికి ఉడుంపూర్ గ్రామస్తులు, యువత కలిసి రూ.18 వేల నగదు ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆదుకున్నారు.

మానవత్వంతో ముందుకు వచ్చిన యువతను గ్రామస్థులు అభినందించారు. అలాగే స్థానిక రేషన్ షాప్ డీలర్ కాశవేణి రాజమల్లు యాదవ్ కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

Leave a Reply