priyanka jawalkar| తెలుగమ్మాయి సొయగాలు
priyanka jawalkar| తెలుగమ్మాయి సొయగాలు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టాలీవుడ్లో తెలుగమ్మాయిలు చాలా తక్కువమంది ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులో ఒకరు ప్రియాంక జవాల్కర్. ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. మైండ్ బ్లోయింగ్ లుక్స్ తో కుర్రోళ్లను మెస్మరైజ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ .
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’తో హీరోయిన్గా పరిచయమయ్యింది ప్రియాంక జవాల్కర్. ‘టాక్సీవాలా’లో క్యూట్‌గా తన నటనతో ఆకట్టుకోవడంతో ప్రియాంకకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని ప్రేక్షకులు అనుకున్నారు. అలాగే అందులోనూ అదరగొట్టుంది.
అనంతపురంకు చెందిన ప్రియాంక జవాల్కర్ టాక్సీవాలా సినిమా లో తన నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. టాక్సీవాలా సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మరోక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది.























