Delhi | ప్రధానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం..

Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. సుమారు అరగంటకుపైగా కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు హాజరయ్యారు.

ఈ సందర్భంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ప్రధాని మోడీని చంద్రబాబు ఆహ్వానించారు. దీనికి స్పందించిన ప్రధాని ఆగస్టు 1న ప్రారంభోత్సవానికి హాజరవుతానని చంద్రబాబు బృందానికి తెలిపినట్లు సమాచారం. ప్రధాని –ముఖ్యమంత్రి భేటీ రాజకీయంగా, పరిపాలనాపరంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో చేపట్టాల్సిన అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.