Team India | బిగ్ షాక్.. ‘కింగ్ కోహ్లీ’ అవుట్!
Team India | బిగ్ షాక్.. ‘కింగ్ కోహ్లీ’ అవుట్!
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును బ్యాక్-టు-బ్యాక్ ఛాంపియన్‌గా నిలిపి… పీక్ ఫామ్‌లో ఉన్న రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. జూన్ 13 నుండి అఫ్గానిస్తాన్‌తో జరగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ (ODI Series) నుండి కోహ్లీని తప్పించారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో తగిలిన హామ్‌స్ట్రింగ్ గాయం (Hamstring Injury) తిరగబెట్టడమే దీనికి కారణమని తెలుస్తోంది.
పీక్ ఫామ్‌లో ఉండగా బ్యాడ్ లక్!
37 ఏళ్ల వయసులోనూ అన్‌మ్యాచ్‌డ్ ఫిట్‌నెస్‌తో దూసుకుపోతున్న కోహ్లీ, మొన్ననే ముగిసిన ఐపీఎల్‌లో 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో ఏకంగా 675 రన్స్ చేసి ఆర్సీబీ టైటిల్ డిఫెన్స్ చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విన్నింగ్ షాట్ కొట్టి ఆర్సీబీకి రెండో ట్రోఫీని అందించాడు కోహ్లీ. అలాంటి రన్ మెషీన్ ఇప్పుడు హోమ్ సిరీస్‌కు దూరం అవ్వడం టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బే.
రోహిత్ శర్మ అందుబాటుపై కూడా సస్పెన్స్!
ఇక మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఐపీఎల్ టైమ్‌లో హామ్‌స్ట్రింగ్ ఇష్యూ ఫేస్ చేయడంతో.. ఆయన ఫిట్‌నెస్ సాధిస్తేనే ఈ సిరీస్ ఆడతారని, లేదంటే రోహిత్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇద్దరు సీనియర్లు మిస్ అయితే సిరీస్ క్రేజ్ సగం తగ్గిపోవడం ఖాయం.
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా పెట్టుకున్న ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్స్.. టెస్ట్, టీ20ల నుండి ఆల్రెడీ రిటైర్ అయ్యారు. ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న తరుణంలో ఇలాంటి గాయాలు ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్నాయి.
ఇండియా వర్సెస్ అఫ్గానిస్తాన్ వన్డే షెడ్యూల్:
ఫస్ట్ వన్డే: జూన్ 13 – ధర్మశాల
సెకండ్ వన్డే: జూన్ 17 – లక్నో
థర్డ్ వన్డే: జూన్ 20 – చెన్నై
ఈ సిరీస్ తర్వాత జూలై 14 నుండి టీమిండియా ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లాల్సి ఉంది. అప్పటికైనా కోహ్లీ కోలుకుని పూర్తి ఫిట్‌నెస్‌తో కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
