పట్టణ సిఐ గా బాధ్యతలు చేపట్టిన…అశోక్ కుమార్.

పట్టణ సిఐ గా బాధ్యతలు చేపట్టిన…అశోక్ కుమార్.

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు పట్టణ సిఐగా సాధారణ బదిలీల్లో భాగంగా ఎన్ అశోక్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి కర్నూలు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటుకు బదిలీ కాగా ఆయన స్థానంలో కౌతాళం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఎన్ అశోక్ కుమార్ నేడు విధుల్లో చేరారు.

ఈ నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఐ ఎన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. పట్టణంలో శాంతిభద్రతల పటిష్టతకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. పట్టణంలోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహి స్తామన్నారు.