పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేయాలి

పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేయాలి
- సిడిపిఓ వెంకటేశ్వరమ్మ
వికారాబాద్, ఆంధ్రప్రభ : పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్ప అంగన్వాడి కేంద్రాన్ని సిడిపిఓ వెంకటేశ్వరమ్మ ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ మనోహరను విద్యార్థుల సంఖ్య, కేంద్ర నిర్వహణ తదితర అంశాలపై ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పోషణ్ అభియాన్ కింద అమలవుతున్న కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సిడిపిఓ వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. రాజీవ్ గృహకల్ప అంగన్వాడి కేంద్రాన్ని అన్ని అంగన్వాడీలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న టీచర్ మనోహరను అభినందించారు.
అంగన్వాడి టీచర్ మనోహర మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్థానికుల సహకారంతో పిల్లలకు సరైన పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రాజీవ్ గృహకల్ప అంగన్వాడి కేంద్రాన్ని వికారాబాద్ జిల్లాలో ఆదర్శ కేంద్రంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇందుకు అందరి సహకారం అవసరమని కోరారు. ఇటీవల ప్రభుత్వం అంగన్వాడి టీచర్లకు సెల్‌ఫోన్లు అందజేయడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
