అగ్ని ప్రమాదాలపై విస్తృత అవగాహన

అగ్ని ప్రమాదాలపై విస్తృత అవగాహన

విజయవాడ, ఆంధ్రప్రభ : ​అగ్నిమాపక వారోత్సవాలు మూడవ రోజు గ్యాస్ గోదాములు, అపార్ట్‌మెంట్లలో విస్తృత అవగాహన కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక శాఖ నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు గురువారం కీలకమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమైనది. అగ్నిమాపక సిబ్బంది జనవాసాలు ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని ప్రధాన ఎల్పీజీ గ్యాస్ గోదాములను సందర్శించి, అక్కడ భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.

గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు అనుసరించాల్సిన అత్యవసర పద్ధతులను సిబ్బందికి యాజమాన్యానికి వివరించారు. ​రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లలో మాక్ డ్రిల్: బహుళ అంతస్తుల భవనాలలో నివసించే ప్రజలకు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. అపార్ట్‌మెంట్లలోని ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్స్, ఫైర్ ఎక్స్‌టింగ్యూషర్లను ఎలా వినియోగించాలో ప్రత్యక్షంగా చేసి చూపించారు.

ముఖ్యంగా వంటగదిలో గ్యాస్ స్టౌలు, రెగ్యులేటర్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, షార్ట్ సర్క్యూట్‌లను నివారించే మార్గాలను వివరించారు. ప్రమాదాల నివారణకు సంబంధించిన సూచనలు, అత్యవసర నంబర్లు (101) కలిగిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదాల నివారణ అనేది కేవలం ఒక శాఖ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఆస్తి, ప్రాణ నష్టాలను అరికట్టగలం” అని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply