ప్రతి ఒక్కరూ ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా తీసుకోవాలి

  • ఉప సర్పంచ్ శివరాజ్ గౌడ్

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జాతీయ డీవార్మింగ్ కార్యక్రమం సందర్భంగా సోమవారం చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసి వేయించారు. ఆశా కార్యకర్త స్వరూప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉప సర్పంచ్ శివరాజ్ గౌడ్ మాట్లాడుతూ, పేగు పురుగుల నివారణ కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న డీవార్మింగ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, చిన్నారులు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శంకరమ్మ, ఉప సర్పంచ్ శివరాజ్ గౌడ్, గ్రామ కార్యదర్శి రాఘవేందర్, ఉపాధ్యాయుడు నరేష్ గౌడ్, అంగన్‌వాడీ టీచర్ యాదమ్మ, ఆశా కార్యకర్త స్వరూప తదితరులు పాల్గొన్నారు.