Polling | పంచాయ‌తీ తుది విడ‌త పోలింగ్ రేపు!

Polling | పంచాయ‌తీ తుది విడ‌త పోలింగ్ రేపు!

  • ఉద‌యం ఏడు గంట‌ల నుంచి పోలింగ్ ప్రారంభం
Polling

Polling | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : పంచాయ‌తీ తుది విడ‌త ఎన్నిక‌లు రేపు (బుధ‌వారం) జ‌రుగుతుంది. డిస్ర్టిబ్యూట‌రీ కేంద్రాల నుంచి పోలింగ్ (Poling) మెటీరియ‌ల‌తో గ్రామాల‌కు సిబ్బంది వెళుతున్నారు. మూడో దశకు సంబంధించి మొత్తం 4,157 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. 11 సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,752 సర్పంచి పదవులకు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అలాగే 36,434 వార్డులకుగాను 112కి నామినేషన్లు దాఖలు కాలేదు. 7916 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 28,106 వార్డులకు పోలింగ్ జ‌రుగుతుంది. ఇప్పటికే రెండు దశల ఎన్నికల అనుభవాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత సన్నాహాలు చేస్తోంది.

Polling
  • ఉద‌యం ఏడు గంట‌ల‌కు పోలింగ్‌

ఉయ‌దం ఏడు గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభ‌మ‌వుతుంది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కూ పోలింగ్ జ‌రుగుతుంది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ఎంత మంది క్యూలో ఉంటే వారంతా ఓటు వేసే వ‌ర‌కూ పోలింగ్ జ‌రుగుతుంది. పోలింగ్ అనంత‌రం భోజ‌న విరామం తీసుకుని రెండు గంట‌ల‌కు కౌంటింగ్ (Counting) ప్రారంభ‌మ‌వుతుంది. ఇందుకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసు యంత్రాంగం చ‌ర్య‌లు తీసుకుంది.

Polling
  • 20న పాల‌క‌వ‌ర్గ స‌మావేశం

మూడు విడ‌త‌ల్లో విజ‌యం సాధించిన పంచాయ‌తీ స‌ర్పంచ్‌, ఉప స‌ర్పంచ్‌, వార్డు స‌భ్య‌ల‌తో 20న పాలకవర్గ తొలి సమావేశం జ‌రుగుతుంది. అదే రోజు స‌ర్పంచ్‌, ఉప స‌ర్పంచ్‌, వార్డు మెంబ‌ర్ల (Ward Member) ప్ర‌మాణాస్వీకారం ఉంటుంది. అనంత‌రం పాల‌క‌వ‌ర్గ స‌మావేశం జ‌రుగుతుంది.

Leave a Reply