Politics | ఏడుగురు ఆప్ ఎంపీల విలీనానికి ఆమోదం

Politics | ఏడుగురు ఆప్ ఎంపీల విలీనానికి ఆమోదం

Politics | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలం మరింత పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల బీజేపీలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ పరిణామంతో సభలో రాజకీయ సమీకరణాలు మారాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ విలీనం అనంతరం రాజ్యసభలో పార్టీల తాజా బలాబలాలను రాజ్యసభ ప్రకటించింది. దీంతో బీజేపీ సభ్యుల సంఖ్య 113కు చేరుకోగా, ఆప్ బలం కేవలం ముగ్గురికి పరిమితమైంది.

రాఘవ్ చడ్ఢా, హర్భజన్ సింగ్ సహా ఏడుగురు ఆప్ రాజ్యసభ సభ్యులు ఇటీవల ఒకేసారి బీజేపీలోకి చేరిన విషయం తెలిసిందే. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply