Supreme Court | తెలంగాణ‌లో కొత్త‌ ఎమ్మెల్సీల ప్ర‌మాణం

Supreme Court | తెలంగాణ‌లో కొత్త‌ ఎమ్మెల్సీల ప్ర‌మాణం

Supreme Court | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. ప్రొఫెస‌ర్ కోదండరాం, రాష్ట్ర‌ మంత్రి అజారుద్దీన్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి ఇటీవల తెలంగాణ రాష్ర్ట గవర్నర్ శివ ప్ర‌తాప్ శుక్లా ఆమోదం తెల‌ప‌డంతో ఈ రోజు వారు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇవాళ మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి త‌న కార్యాల‌యంలో వారితో ప్ర‌మాణం చేయించ‌నున్నారు. దీంతో గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌ల నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ రోజు నుంచి ఆరేళ్లపాటు వీరు ఎమ్మెల్సీలుగా కొనసాగనున్నట్లు తెలిపింది. అయితే, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉంది. తుది తీర్పు ప్రభుత్వాని అనుకూలంగా వస్తే వీరి సభ్యత్వాలకుఎలాంటి ప్రమాదం ఉండబోదని శాసనమండలి వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీగా అజారుద్దీన్ నియామ‌కం కావ‌డంతో ఆయ‌న ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 30 లోపు ఏ సభలోనూ సభ్యుడిగా ఉండ‌కుంటే ఆయ‌న మంత్రి ప‌ద‌వికి ఎస‌ర వ‌చ్చేది. సీఎం రేవంత్ చొర‌వ‌తో గ‌వ‌ర్న‌ర్ ఆమోదంతో అజారుద్దీన్ ఎమ్మెల్సీగా నియామ‌క‌మ‌య్యారు. గడువు ముగియడానికి కేవలం ఐదు రోజుల ముందే గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో మంత్రి అజారుద్దీన్‌కు లైన్ క్లియర్ అయింది.