15‍‍‍-dead : అవి చావు కుంపట్లు Andhra Prabha Crime Story

15‍‍‍-dead : అవి చావు కుంపట్లు Andhra Prabha Crime Story

  • కోచింగ్​ సెంటర్లు కావు
  • నిబంధనలకు తాళాలు
  • ఘోరాలకు చిరునామాలు
  • ప్రమాదాలతొనే .. సర్కార్లు కళ్లు తెరిచేది

( ఆంధ్రప్రభ, లక్నో ప్రతినిధి )

ఉజ్వల భవిష్యత్తు కోసం.. సోటీ పరీక్షల్లో విజయం కోసం తపించే నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే కోచింగ్​ సెంటర్లే.. మృత్యుకుహరాలుగా మారుతుంటే.. కళ్ల ముందే యువజనం సజీవదహనమైన తరుణంలోనే..స్రభత్వాలు కళ్లు తెరుస్తాయి. సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకోవటం ఆనవాయితీగా మారింది. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని అలీగంజ్ ప్రాంతంలో ఒక కోచింగ్ సెంటర్ భవనంలో సోమవారం మధ్యాహ్నం సుమారు 3:00 గంటలకు అత్యంత ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది మరణిం యారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

15‍‍‍-dead : అసలు ఏమి జరిగింది ?

అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్ (పురానియా సమీపంలో) ఉన్న ఒక మూడంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. భవనం కింది భాగం గ్రౌండ్ ఫ్లోర్ లోని ఒక పెట్ షాప్/షోరూమ్‌లో మంటలు అంటుకున్నాయి. . ఆ మంటలు చాలా వేగంగా పై అంతస్తుల్లోని లైబ్రరీ, గేమింగ్ జోన్ , కంప్యూటర్ కోచింగ్ సెంటర్‌కు విస్తరించాయి . ప్రమాదం జరిగిన సమయంలో ఆయా కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలో వందలాది మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.

మంటలు పైకి వ్యాపించడంతో దట్టమైన నల్లటి పొగ భవనాన్ని కమ్మేసింది. లోపల విద్యార్థులకు ఊపిరాడలేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి పలువురు విద్యార్థులు మొదటి, రెండో అంతస్తుల కిటికీల నుండి కిందకు దూకారు. కిందకు దూకడం వల్ల కొందరికి వెన్నుముక, కాళ్ళు విరిగి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు నివేదికలు వస్తున్నాయి. దాదాపు 14 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్ వాహనాల సహాయంతో చాలా మంది విద్యార్థులను సురక్షితంగా రక్షించారు. వాష్‌రూమ్‌లలో దాక్కున్న విద్యార్థులను రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

15‍‍‍-dead : లోపాలు యథాతథం

భద్రతా లోపాలు, నిబంధనల ఉల్లంఘనలను ఈ ఘోర ప్రమాదం ఎత్తిచూపుతోంది. భవనంలో కనీస ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు (మంటలు ఆర్పే పరికరాలు) లేదా స్ప్రింక్లర్ వ్యవస్థలు పనిచేయలేదని తెలుస్తోంది. వాణిజ్య భవనాల్లో అత్యవసర సమయంలో బయటకు రావడానికి ప్రత్యేక మార్గాలు ఉండాలి. కానీ ఈ భవనంలో కేవలం ఒకే ఒక ఇరుకైన మెట్ల దారి ఉండటం వల్ల, పొగ కమ్మేయడంతో విద్యార్థులు బయటకు రాలేకపోయారు. అందుకే కిటికీల నుండి దూకారు. రద్దీగా ఉండే ఈ కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఒకే చోట పెట్ షాప్స్, షోరూమ్స్, గేమింగ్ జోన్స్ , వందలాది మంది చదువుకునే కోచింగ్ సెంటర్లను అనుమతించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

15‍‍‍-dead : ప్రభుత్వం విచారం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడంతో పాటు, భవన నిర్వాహకులపై భద్రతా అనుమతులపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు

15‍‍‍-dead : ఢిల్లీలో సివిల్​ సర్వీసెస్​ అభ్యర్థులు

కోచింగ్​ సెంటర్లే.. కానీ ఉత్తర ప్రదేశ్​లో ఇలాటి ఘోర ప్రమాదాలు ఈ నాటివి కాదు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులే ఈ ఘోర ఖలిలో బలి అవుతున్నారు.
సివిల్ సర్వీసెస్ కోచింగ్ హబ్‌గా పేరొందిన ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని ‘రావ్స్ ఐఏఎస్ స్టడీ సర్కిల్’ లో జూలై 2024)న దారుణ ఘటన మరువలేనిది. భారీ వర్షం కారణంగా రోడ్డుపై చేరిన వరద నీరు ఒక్కసారిగా భవనం గేట్లను బద్దలుకొట్టుకుంటూ బేస్‌మెంట్‌లోకి దూసుకెళ్లింది. కేవలం కొన్ని నిమిషాల్లోనే బేస్‌మెంట్ మొత్తం నీట మునిగింది అక్కడ చదువుకుంటున్న ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు తాన్యా సోని, శ్రేయా యాదవ్, నవీన్ డెల్విన్ ఈ వరద నీటిలో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. నిబంధనల ప్రకారం ఆ బేస్‌మెంట్‌ను కేవలం పార్కింగ్ లేదా స్టోరేజ్ కోసం మాత్రమే వాడాలి. కానీ యాజమాన్యం అక్కడ చట్టవిరుద్ధంగా లైబ్రరీని ఏర్పాటు చేసింది. బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ సిస్టమ్ పవర్ కట్ అవ్వడం వల్ల లాక్ అయిపోవడంతో విద్యార్థులు బయటకు రాలేకపోయారు.

15‍‍‍-dead : సూరత్​ లో 22 మంది బలి

గుజరాత్ సూరత్ తక్షశిల ఆర్కేడ్ అగ్నిప్రమాదం (మే 2019)దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన అత్యంత ఘోరమైన ప్రమాదాలలో ఇది ఒకటి.ప్రమాదం జరిగిందిలా: సూరత్‌లోని తక్షశిల ఆర్కేడ్ వాణిజ్య సముదాయంలో నడుస్తున్న ఒక కోచింగ్ సెంటర్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్నిప్రమాదం సంభవించింది.తీవ్రత: ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు . ఆ భవనం పై అంతస్తును ప్లాస్టిక్ షీట్లు, టైర్ల వంటి సులభంగా మంటలు అంటుకునే వస్తువులతో అక్రమంగా నిర్మించారు. అత్యవసరంగా బయటకు వెళ్లేందుకు ఎలాంటి మెట్లు లేవు.

15‍‍‍-dead : 61 మంది విలవిల

ఢిల్లీలోని మరో ప్రధాన కోచింగ్ కేంద్రం ముఖర్జీ నగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఒక వాణిజ్య భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని విద్యుత్ మీటర్ బోర్డులో మంటలు చెలరేగి, పొగ పై అంతస్తులలో ఉన్న కోచింగ్ సెంటర్‌ను కమ్మేసింది. ప్రాణాలు కాపాడుకోవడానికి దాదాపు 61 మంది విద్యార్థులు కిటికీల గుండా వైర్లు, తాళ్ల సహాయంతో కిందకు దిగుతూ తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.

15‍‍‍-dead : ఇదొక కోచింగ్​ కుంపటి కేంద్రం

దేశంలోనే అతిపెద్ద కోచింగ్ హబ్గా కోటాలో తరచూ హాస్టళ్లు కోచింగ్ సంస్థలలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉండటం, భవనాలలో సరైన ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ లేకపోవడం వల్ల ఇక్కడ పలుమార్లు విద్యార్థులు గాయపడిన ఘటనలు నమోదయ్యాయి. :ఈ తరహా ప్రమాదాలన్నింటిలోనూ నిబంధనల ఉల్లంఘన ప్రధాన కారణం అని దర్యాప్తులో తేలింది. బేస్‌మెంట్లను చట్టవిరుద్ధంగా తరగతి గదులుగా, లైబ్రరీలుగా మార్చడం.అత్యవసర ద్వారాలు లేకపోవడం.డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో పాటు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.ఢిల్లీ బేస్‌మెంట్ ప్రమాదం అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న కోచింగ్ సెంటర్లపై మున్సిపల్ అధికారులు, ఫైర్ డిపార్ట్‌మెంట్‌లు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టాయి. నిబంధనలు పాటించని వందలాది బేస్‌మెంట్లు, కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు.