రోడ్డు కష్టాలు ఎన్ని ఏండ్లు?

రోడ్డు కష్టాలు ఎన్ని ఏండ్లు?

  • బెజ్జంకి–బేగంపేట్ రహదారి పనులు నిలిచిపోవడంతో ప్రజల ఆవేదన

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని బెజ్జంకి–బేగంపేట్ రహదారి అసంపూర్తిగా ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు సంవత్సరాలుగా పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో రహదారి దుస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోంది. ఈ సందర్బంగా సీపీఐ కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గంటల తరబడి వాహనాలను నిలిపివేశారు.

వర్షాకాలంలో గుంతలు నీటితో నిండిపోవడం, వేసవిలో దుమ్ము సమస్య పెరగడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రమాదాలు గురైతున్నప్పటికి నాయకులు ఎటువంటి శాశ్వత పరిష్కారం తీసుకురాకపోవడంతో స్థానికుల ఆగ్రహానికి వ్యక్తం చేసారు.. ప్రభుత్వాలు మారిన రోడ్డు అవస్థలు మారడంలేదని చివరకు అత్యవసర సేవలు కూడా సకాలంలో చేరలేకపోవడం పరిస్థితిని మరింత విషమంగా మారుస్తోందని వాపోయారు.

ఈ నేపథ్యంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడే విధంగా రహదారులను నిర్లక్ష్యం చేయడం అత్యంత దురదృష్టకరం. గతంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ రహదారి పనులను ప్రారంభించినప్పటికీ, అవి సగం దశలోనే ఆగిపోవడం ప్రజల్లో నిరాశను మిగిల్చింది.

తరువాత బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఈ సమస్యను పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోందన్నారు. ప్రభుత్వాలు, నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇస్తారు గానీ, ఆ తర్వాత ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారు విమర్శించారు. శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే స్పందించి రహదారి పనులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని లేదంటే ప్రజలు ఆందోళనకు దిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.

Leave a Reply