రోడ్డెక్కి నిరసన చేపట్టిన రైతులు…

రోడ్డెక్కి నిరసన చేపట్టిన రైతులు…

అధికారుల హామీతో ధర్నాను విరమించిన రైతులు…

గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండలంలోని తేరటుపల్లి గ్రామంలోని వడ్ల కొనుగోలు కొనుగోలు కేంద్రం వద్ద మంగళవారం రైతులు గట్టుప్పల చండూరు రోడ్డు పైకి వచ్చి ధర్నా చేసి, నిరసన చేపట్టారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అధికారులు ఆలస్యం చేయడం, అనవసరమైన నిబంధనలు విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 9 తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు, ఇప్పటివరకు 3 లారీల ధాన్యాన్ని కొనుగోలు చేశారని,నెలరోజులు సమీపిస్తుండడంతో ఇప్పటివరకు 224 మంది రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి చేర్చారు.

అందులో 24 మంది రైతుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి, 3 లారీలలో 750 బస్తాల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. (750 బస్తాల ధాన్యానికి 15 క్వింటాళ్లు కోత విధించడంతో)40 కేజీల బస్తాకు 3 కిలోల 700 గ్రాములు కోత విధించడంతో రైతులు రోడ్డెక్కి ధర్నా చేసి నిరసన చేపట్టారు. గట్టుప్పల చండూరు రోడ్డు రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో తహశీల్దార్ రాములు, సివిల్ సప్లైడిటి రఘునందన్ రావు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే లారీలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని, ఎలాంటి తాలు శాతం కటింగ్‌లు లేకుండా కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.అధికారుల హామీతో రైతులు తాత్కాలికంగా నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గొరిగే సత్తయ్య, ఉప సర్పంచ్ బొట్ట శివ,మాజీ సర్పంచ్ మలిగే శ్రీశైలం, కట్ట యాదగిరి,కట్ట స్వామి,బండారు రాములు, కట్ట వెంకన్న, చలమల్ల బుచ్చిరెడ్డి, గిరి సత్తయ్య, దెందే యాదయ్య, మలిగే లింగస్వామి, చెరుకుపల్లి వెంకటయ్య, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Leave a Reply