శానిటరీ వర్కర్లకు సన్మానం…
శానిటరీ వర్కర్లకు సన్మానం…
బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ ముక్కిస కవిత రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి అనూష, పాలకవర్గ సభ్యులతో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలు కప్పి సత్కరించారు. అలాగే వారికి సబ్బులు, కొబ్బరి నూనె పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ 6వ వార్డు సభ్యుడు బోనగిరి మహేష్ తన సొంత ఖర్చులతో పారిశుధ్య కార్మికులకు షూస్, గ్లోవ్స్, మాస్క్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామం పరిశుభ్రంగా ఉండటానికి పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. వారు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామ ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.
అందుకే వారికి ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
